Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. తులం గోల్డ్‌ ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు

Gold Price Today: అక్షయ తృతీయ మహా పండుగకు ముందే, బులియన్ మార్కెట్ లో పసిడి పరుగులు పెడుతోంది. తగ్గినట్లే తగ్గి పెరుగుతోంది. పన్ను , ఎక్సైజ్ సుంకం కారణంగా బంగారం, వెండి ధరలలో ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు లోనవుతాతుంది. తాజాగా మరోసారి బంగారం ధర పెరిగింది..

Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. తులం గోల్డ్‌ ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు

Updated on: Apr 29, 2025 | 10:18 AM

పసిడి.. ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఓ ప్రత్యేక స్థానముంది. గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోంది. ఒక రోజు వంద తగ్గితే మరో రోజు అంతకు రెండింటింతలు పెరుగుతోంది. అయితే తాజాగా ఏప్రిల్‌ 29న దేశంలో గోల్డ్‌ రేట్లు పెరిగాయి. తులం బంగారంపై 440 రూపాయలు ఎగబాకింది. ఇక దేశంలోని ముఖ్యమైన నగరాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  1. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 89 వేల 995 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల రేటు 98 వేల 120 రూపాయల వద్ద ఉంది.
  2. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 89,800 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల ధర 97 వేల 970 రూపాయలు ఉంది.
  3. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89 వేల 800 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 97 వేల 970 రూపాయల వద్ద ఉంది.
  4. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం 89 వేల 800 రూపాయల వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 97 వేల 970 రూపాయల ఉంది.
  5. ఇక వెండి ధరను పరిశీలిస్తే కిలో సిల్వర్‌ ధర లక్షా 5 వేల రూపాయల వద్ద ఉంది.

గత ఒక సంవత్సరంలో పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలలో బంగారం ప్రకాశించింది . మే 10, 2024 నుండి ఇప్పటివరకు బంగారం 30% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) సమీపిస్తున్న కొద్దీ, విలువైన ఎల్లో మెటల్‌ ఆకర్షణ మరింత బలంగా ఉంటుంది. అయితే, అధిక ధరల కారణంగా, కస్టమర్ సెంటిమెంట్‌లో మార్పు కనిపిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..