
Gold Price Today: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. రెండు రోజులుగా మళ్లీ ఎగబాకుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరుసటి రోజు అందకు రెట్టింపుగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజు తులంపై రూ.700లకుపైగా పెరిగింది. అదే వెండిపై రూ.3000 వరకు పెరిగింది. రెండు రోజులుగా రెండి ధరపై పెరుగుదలను పరిశీలిస్తే ఏకంగా రూ.7000 వరకు ఎగబాకింది. ప్రస్తుతం నవంబర్ 29వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,760 ఉంది ఇక వెండి ధర కిలోకు రూ.1,83,100 వద్ద కొనసాగుతోంది.
భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, డాలర్-రూపాయి మారకం రేటు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే బంగారం ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు గురవుతాయి. భారతీయ సంస్కృతిలో, బంగారాన్ని ఒక ఆభరణాల వస్తువుగా మాత్రమే కాకుండా ముఖ్యమైన పెట్టుబడి, పొదుపు సాధనంగా కూడా పరిగణిస్తారు. వివాహాలు, పండుగల సమయంలో దీనికి అధిక డిమాండ్ ఉంటుంది.
ఇది కూడా చదవండి: UIDAI: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆధార్ కోసం పాన్ చెల్లదు!
ఇది కూడా చదవండి: 2026 Holidays List: ఉద్యోగులు, విద్యార్థుల గుడ్‌న్యూస్.. వచ్చే ఏడాది భారీగా సెలవులు.. జాబితా విడుదల
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి