Gold Price: గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర.

భారత దేశంలో పెళ్లిళ్ల సీజన్‌ ఉన్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ కారణంతో బంగారం అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం బంగారం ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. అయితే ఈ తగ్గుదల చాలా స్వల్పమే అని చెప్పాలి...

Gold Price: గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర.
Gold Price

Updated on: Feb 13, 2024 | 6:50 AM

ఇటీవల బంగారం ధరల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. అలా అనీ పెద్దగా తగ్గుదుల కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం భారత దేశంలో పెళ్లిళ్ల సీజన్‌ ఉన్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ కారణంతో బంగారం అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం బంగారం ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. అయితే ఈ తగ్గుదల చాలా స్వల్పమే అని చెప్పాలి. 10 గ్రాముల బంగారంపై కేవలం రూ. 10 తగ్గింది. మరి నేడు దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రజాధాన్యి ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,840కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 63,090 వద్ద కొనసాగుతోంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,690గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,940 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ ర. 58,290, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,590గా ఉంది. బెంగళూరులో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,690గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,940 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

మంగళవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,690గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,940 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా విజయవాడలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,690గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,940 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తే వెండి ధర మాత్రం పెరిగింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై మంగళవారం రూ. 100 పెరిగింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం కిలో వెండి ధర రూ. 75,600కి చేరింది. అలాగే చెన్నలో అత్యధికంగా రూ. 77,100 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 75,600గా ఉండగా, కోల్‌కతాలోనూ ఇదే ధర కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో మంగళవారం కిలో వెండి దర రూ. 77,100 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..