Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Gold Price Today: బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం, తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధరల్లో తేడాలు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని..

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Updated on: Oct 27, 2025 | 6:28 AM

Gold Price Today: బంగారం ధరలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో రెండు, మూడు రోజుల నుంచి కాస్త దిగి వస్తున్నాయి. ఇటీవల తులం బంగారం ధర ఏకంగా లక్షా 33 వేల వరకు వెళ్లళ్లగా, ప్రస్తుతం లక్షా 25 వేల వద్ద కదలాడుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. నిన్న తులం బంగారంపై అతి స్వల్పంగా అంటే పది రూపాయల మేరకు తగ్గింది. ఈ రోజు కూడా అదే ధరతో కొనసాగుతోంది. అక్టోబర్‌ 27న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,25,610 వద్ద కొనసాగుతోంది.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,760 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,290 ఉంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,140 ఉంది.
  3. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,140 ఉంది.
  4. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,140 ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,440 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,990 ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,140 ఉంది.
  7. ఇక వెండి కూడా అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది కేవలం వంద రూపాయలు మాత్రమే తగ్గి ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,54,900 వద్ద కొనసాగుతోంది.

బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణం ఏమిటి?

బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం, తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధరల్లో తేడాలు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా గమనిస్తున్నారు. ఫలితంగా, వారు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏదీ ఏమైనా ప్రస్తుతం బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గినా తర్వాత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us