బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ప్రతీ రోజూ బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం గోల్డ్ రేట్స్ ఓ రేంజ్‌లో పెరిగిపోతున్న తరుణంలో బుధవారం బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడినట్లు కనిపించినా తాజాగా గురువారం మళ్లీ ధరలు పెరిగాయి. అయితే ఈ పెరుగుదల స్వల్పమే అయినా బంగారం ధరలు తగ్గుముఖం పడతాయని అనుకుంటున్న వారికి కాస్త షాకింగ్ అంశంగానే చెప్పొచ్చు. ఇంతకీ గురువారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,610గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,810 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,610కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,660గా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,310గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,430 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 66,610, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,660 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,610గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,660 వద్ద కొనసాగుతోంది విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,610గానూ, 24 క్యారెట్ల గోల్ఢ్ ధర రూ. 72,660గాను ఉంది.
బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం తగ్గుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీతో పాటు కోల్‌కతా ముంబయి, పుణెలో వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 82,800 వద్ద కొనసాగుతోంది. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 86,300 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి