
Gold Price Today: గత నాలుగైదు రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ భారీగా పడిపోవడం, దేశీయంగా స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో దేశీయంగా ధరలు దిగివచ్చినట్లు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నవంబర్ 28న తులం బంగారం ధర రూ.1,27,740 వద్ద కొనసాగుతోంది. బంగారం రేట్లు ఒక వైపు క్రమంగా తగ్గుతూ ఉంటే వెండి మాత్రం తీవ్రమైన ర్యాలీని కొనసాగిస్తోంది. నవంబర్ 27న కేజీకి వెండి నవంబర్ 26తో పోల్చితే ఏకంగా రూ.4వేల వరకు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 80 వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.180 వద్ద విక్రయాలు జరగుతున్నాయి. అయితే బంగారం మాత్రం నిన్నటితో పోలిస్తే తులంపై 170 తగ్గింది.
ఇది కూడా చదవండి: Relationship Tips: మీ భార్య మీతో గొడవపడి అలిగిందా? ఇలా చేస్తే వెంటనే కూల్ అయిపోతారు!
ఇది కూడా చదవండి: Home Remedies: మీ ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఇలా చేశారంటే చిటికెలో మటుమాయం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి