Gold Price: రూ.1.20 లక్షలకు చేరువలో తులం బంగారం ధర.. హైదరాబాద్‌లో గోల్డ్‌ ధర ఎంతో తెలుసా?

Gold Price Today: బంగారం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో పసిడి ఆభరణాలను కొనుగోలు చేయడం అనేది చాలా కష్టతరమైన పని అని చెప్పవచ్చు. సామాన్యులు తులం బంగారం కొలన్నా కొనే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా బంగారం ధరలు భారీగా పెరిగినప్పటి నుంచి మార్కెట్లో..

Gold Price: రూ.1.20 లక్షలకు చేరువలో తులం బంగారం ధర.. హైదరాబాద్‌లో గోల్డ్‌ ధర ఎంతో తెలుసా?

Updated on: Sep 28, 2025 | 6:40 AM

బంగారం ధరలు ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. రోజు రోజుకు పరుగులు పెడుతోంది. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా ఎగబాకుతోంది. బంగారం ధర ప్రస్తుతం ఉన్న ధర వద్ద ఆల్ టైం రికార్డ్ సమీపానికి చేరుకుందనే చెప్పవచ్చు. గతంలో బంగారం ధర 1.18 లక్షల రూపాయల వద్ద ఆల్ టైం రికార్డును తాకింది. బంగారం ధర ప్రతిరోజు సరికొత్త రికార్డును సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. బంగారం ధర పెరగడానికి ప్రధానంగా డాలర్ విలువ పతనం అవడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే నిన్నటితో పోలిస్తే ఆదివారం తులం బంగారం ధరపై 1500 రూపాయలకుపైగా పెరిగిందనే చెప్పవచ్చు. దేశీయంగా తులం బంగారం ధర 1,15,480 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Anant Ambani: అనంత్ అంబానీ వాచ్ కలెక్షన్‌లో ఒకదాని ధర ఎంతో తెలుసా? BMW కార్లనే కొనొచ్చు!

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  1. ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,06,000 ఉంది.
  2. హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,480 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,850 ఉంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,480 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,850 ఉంది.
  5. చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,06,400 ఉంది.
  6.  విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,480 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,850 ఉంది.
  7. బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,480 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,05,850 ఉంది.
  8. ఇక బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1.49,000 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌, చెన్నై, కేరళ రాష్ట్రాలో మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.1,59,000 ఉంది.

బంగారం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో పసిడి ఆభరణాలను కొనుగోలు చేయడం అనేది చాలా కష్టతరమైన పని అని చెప్పవచ్చు. సామాన్యులు తులం బంగారం కొలన్నా కొనే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా బంగారం ధరలు భారీగా పెరిగినప్పటి నుంచి మార్కెట్లో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది.

ఇది కూడా చదవండి: Mahindra: మహీంద్రా కారుపై బంపర్‌ ఆఫర్‌.. రూ.2.56 లక్షల వరకు తగ్గింపు

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి