
Gold and Silver Prices Today: బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితిలో బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం బంగారం పేరు తీస్తేనే భయపడిపోతున్నారు. దేశవ్యాప్తంగా బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ప్రపంచ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో నేడు కూడా ధరలు భారీగా పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో స్వల్పంగా పెరిగినా ఇప్పుడు మాత్రం వేల్లోనే పరుగులు పెడుతున్నాయి. అయితే ప్రస్తుతం జనవరి 26న దేశీయంగా బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ తగ్గిన ధరలను చూస్తే ఇదేందిరా నాయనా బంగారం ధర ఇంత తగ్గింది అనేలా ఉంది. పెరిగినప్పుడు వేల్లో పెరుగుతుంది. కానీ తగ్గినప్పుడు పదుల సంఖ్యలోనే తగ్గుముఖం పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇతర తగ్గినా తగ్గకున్నా ఒక్కటేననంటున్నారు వినియోగదారులు. తులం బంగదారంపై కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సోమవారం దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
దేశీయంగా 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.1,60,250 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,890 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే దేశీయంగా కిలో వెండిపై కేవలం వంద రూపాయలు మాత్రమే తగ్గి రూ.3,34,900 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో మాత్రం ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలో సిల్వర్ ధర రూ.3,64,900 ఉంది.
దేశవ్యాప్తంగా ఒకే బంగారం రేటు ఇంకా ఉండదు. భారతదేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు మారుతూ ఉంటాయి. స్థానిక పన్నులు, నగల తయారీ ఛార్జీలతో పాటు, అనేక ఇతర అంశాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా, దక్షిణ నగరమైన చెన్నైలో బంగారం ధరలు అత్యంత వేగంగా పెరుగుతాయి, తగ్గుతాయి. అలాగే వెండి ధరలు ఇతర నగరాలకంటే హైదరాబాద్, చెన్నై, కేరళలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి