Gold Price Today: లక్ష కొట్టేలా ఉందిగా.! మళ్లీ కొండెక్కిన బంగారం.. తులం ఎంతుందంటే.?

బంగారం ధరలలో ఈ మధ్యకాలంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులు పెరుగుతూపోతుంటే.. మరికొన్ని రోజులు తగ్గుముఖం పడుతున్నాయి. మరి ఇవాళ హైదరాబాద్ లో తులం బంగారం ఎంతుందంటే.. అటు వెండి ధరలు కూడా ఇలా.. ఆ వివరాలు ఈ స్టోరీలో ఓ లుక్కేయండి.

Gold Price Today: లక్ష కొట్టేలా ఉందిగా.! మళ్లీ కొండెక్కిన బంగారం.. తులం ఎంతుందంటే.?
Gold Rate

Updated on: Feb 25, 2025 | 8:22 AM

బంగారం మళ్లీ కొండెక్కింది. మహిళలకు షాక్ ఇస్తూ వరుసగా రెండో రోజు పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన మూడు రోజుల్లో సుమారు రూ. 500 మేరకు పెరిగిన స్వచ్చమైన బంగారం ధర.. ప్రస్తుతం రూ. 87,880 దగ్గర కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ. 87,880 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,560గా ఉంది. అటు సిల్వర్ రేట్లు కూడా బంగారం బాట పట్టాయి. గడిచిన రెండు రోజుల్లో రూ. 600 మేరకు పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి రూ. 1,01,100గా ఉంది.

22 క్యారెట్ల బంగారం

  • హైదరాబాద్ – రూ. 80,560
  • విజయవాడ – రూ. 80,560
  • చెన్నై – రూ. 80,560
  • బెంగళూరు – రూ. 80,560
  • ఢిల్లీ – రూ. 80,700
  • కోల్‌కతా – రూ. 80,560
  • ముంబై – రూ. 80,560

24 క్యారెట్ల బంగారం

  • హైదరాబాద్ – రూ. 87,880
  • విజయవాడ – రూ. 87,880
  • చెన్నై – రూ. 87,880
  • బెంగళూరు – రూ. 87,880
  • ఢిల్లీ – రూ. 88,030
  • కోల్‌కతా – రూ. 87,880
  • ముంబై – రూ. 87,880

వెండి ధరలు ఇలా

  • హైదరాబాద్ – రూ. 1,08,100
  • విజయవాడ – రూ. 1,08,100
  • చెన్నై – రూ. 1,08,100
  • బెంగళూరు – రూ. 1,01,100
  • ఢిల్లీ – రూ. 1,01,100
  • కోల్‌కతా – రూ. 1,01,100
  • ముంబై – రూ. 1,01,100

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us