గత కొన్నిరోజులకు గోల్డ్ లవర్స్‌ని తికమక పెడుతోంది బంగారం ధర. రెండు రోజులు ధర తగ్గితే.. వరుసగా మూడు రోజులు భారీగా ధరలు పెరిగి పసిడి ప్రియులను భయపెడుతున్నాయి. ఇక ఇప్పుడు కొత్త సంవత్సరం ముందు మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్‌లో నెగటివ్ సంకేతాలు, రూపాయ్ విలువ పతనం, అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుదల.. ఇలా పసిడి ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. మంగళవారం దేశంలోని వివిధ నగరాల్లో గోల్డ్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 170 పెరగగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 160 మేరకు పెరిగింది. అటు వెండి ధరలు అయితే వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే కిలో వెండి మరో రూ. 100 మేరకు తగ్గింది. మరి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78,010గా ఉంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 71,510గా ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 78,160గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,660కి ఎగబాకింది. అటు చెన్నై, కోల్‌కతా, ముంబై, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,010గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,510గా ఉంది.
వెండి ధరల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ. లక్షకు చేరువైంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 99,800గా ఉంది. ఇక విజయవాడ, కేరళ, చెన్నైలో ఇదే ధర కొనసాగుతోంది. ముంబైలో కేజీ వెండి ధర రూ. 92,400 కాగా.. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 92.300గా ఉంది. కాగా, పైన పేర్కొన్న ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ గోల్డ్ రేట్స్ కోసం 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి