Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గేదేలే అంటున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..

|

Apr 09, 2024 | 6:33 AM

గోల్డ్ లవర్స్‌కి షాక్ తగిలింది. బంగారం ధర మళ్లీ కొండెక్కి కూర్చుంది. ఆకాశం వైపే చూస్తోంది. రికార్డులు బద్దలుకొడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో బంగారం ఆల్‌ టైం రికార్డు ధర పలుకుతోంది. 70వేల మార్కును దాటిన పసిడి పరుగులు తీస్తోంది.. ఇక వెండి కూడా రూ.80 వేల మార్కును దాటి రికార్డు స్థాయికి చేరింది. దీంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గేదేలే అంటున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
Gold Price Toady
Follow us on

గోల్డ్ లవర్స్‌కి షాక్ తగిలింది. బంగారం ధర మళ్లీ కొండెక్కి కూర్చుంది. ఆకాశం వైపే చూస్తోంది. రికార్డులు బద్దలుకొడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో బంగారం ఆల్‌ టైం రికార్డు ధర పలుకుతోంది. 70వేల మార్కును దాటిన పసిడి పరుగులు తీస్తోంది.. ఇక వెండి కూడా రూ.80 వేల మార్కును దాటి రికార్డు స్థాయికి చేరింది. దీంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర అక్షరాలా 71 వేల 280 రూపాయలు ఉంది.. వెండి కేజీ రూ.83,400 లుగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే.. వేసవిలో పెళ్లిళ్ల సీజన్‌ నాటికి పరిస్థితి ఏంటి? అని బెంబేలెత్తిపోతున్నారు జనం.. అయితే.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉండటంతో భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి బంగారం, వెండి ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు.. ఒక్కోసారి ధర పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి.. కానీ.. ఇటీవల కాలంలో ధరలు మాత్రం నాన్‌స్టాప్ గా పెరుగుతూ వస్తున్నాయి. కాగా.. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పుత్తడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,490, 24 క్యారెట్ల ధర రూ.71,430 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.65,340, 24 క్యారెట్లు రూ.71,280

చెన్నైలో 22క్యారెట్లు రూ.66,140, 24 క్యారెట్లు రూ.72,150

బెంగళూరులో 22క్యారెట్ల ధర రూ.65,340, 24 క్యారెట్లు రూ.71,280

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22క్యారెట్లు రూ.65,340, 24 క్యారెట్లు రూ.71,280 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.83,400, ముంబైలో రూ.83,400, బెంగళూరులో రూ.83,100, చెన్నైలో రూ.86,900, హైదరాబాద్‌లో రూ.86,900, విజయవాడలో రూ.86,900, విశాఖపట్నంలో రూ.86,900 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..