Gold Price Today: పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

|

Apr 03, 2024 | 6:25 AM

స్టాక్ మార్కెట్లతో పోటీ పడి పరుగులు పెడుతోంది.. బంగారం ధర. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ..లక్ష దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి.. తాజాగా 70వేల మార్కును తాకడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ఉంటే..బంగారం ధరలు తక్కువగా ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది.

Gold Price Today: పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold
Follow us on

స్టాక్ మార్కెట్లతో పోటీ పడి పరుగులు పెడుతోంది.. బంగారం ధర. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ..లక్ష దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి.. తాజాగా 70వేల మార్కును తాకడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ఉంటే..బంగారం ధరలు తక్కువగా ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది. స్టాక్‌ మార్కెట్లతో పోటీ పడి బంగారం రేట్లు రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. స్టాక్స్‌ పడిపోతే బంగారం ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు కారణం మదుపరులు తమ పెట్టుబడులకు రక్షణగా గోల్డ్‌ను ఎంచుకోవడమే. దీంతో ఈ ఏడాది బంగారం, వెండి ధరల్లో మరో 12 నుంచి 15 శాతం మేర పెరుగుదల ఉండొచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. ఎప్పటికప్పుడు బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతుంటాయి. తాజాగా, బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం (3 ఏప్రిల్ 2024) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 10గ్రాముల బంగారంపై రూ.10 తగ్గగా.. కిలో వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,340, 24 క్యారెట్ల ధర రూ.69,100 గా ఉంది. కిలో వెండి ధర రూ.79,100గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,490 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,250 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్లు రూ.63,340, 24 క్యారెట్లు రూ.69,100

చెన్నైలో 22 క్యారెట్లు రూ.64,290, 24క్యారెట్లు రూ.70,140

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.63,340, 24క్యారెట్లు రూ.69,100

హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.63,340, 24క్యారెట్ల ధర రూ.69,100 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.79,100 లుగా ఉంది.

ముంబైలో రూ.79,100

బెంగళూరులో రూ.77,400

చెన్నైలో రూ.82,100

హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో రూ.82,100గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..