Gold Rates Today: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల కాలంలో బంగారం ధరలు స్వల్పంగా దిగివస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బంగారం ధర మళ్లీ కొంతమేర తగ్గింది. శనివారం బంగారం ధర 100 గ్రాములపై రూ.600 మేర తగ్గింది. దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 46,130 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,130 గా ఉంది. అయితే.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
• దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,250 గా ఉంది.
• ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,130 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,130 వద్ద కొనసాగుతోంది.
• బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,000 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,000 వద్ద ఉంది.
• చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,400 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
• హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,000 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.48,000 వద్ద కొనసాగుతోంది.
• విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.48,000 వద్ద కొనసాగుతోంది.
• విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,000 వద్ద కొనసాగుతోంది.
Also Read: