Gold Price Today: పండుగ పూట మహిళలకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం పసిడి రేట్‌ ఎంతంటే..?

|

Jan 14, 2022 | 7:06 AM

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంది. బంగారం ధరలు

Gold Price Today: పండుగ పూట మహిళలకు షాక్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం పసిడి రేట్‌ ఎంతంటే..?
Follow us on

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంది. బంగారం ధరలు ఎంత పెరిగినా ప్రతి రోజు బంగారం వ్యాపారాలు జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. షాపుల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. దేశంలో బంగారం ధరల్లో ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో పెరిగితే.. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగానూ, స్థిరంగా ఉంటాయి. ఇక కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక

శుక్రవారం (జనవరి 14)న దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు మరింతగా పెరిగాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఒక వేళ తగ్గవచ్చు.. లేదా పెరగొచ్చు. తాజాగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో..

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,960 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,220 వద్ద ఉంది.

► ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,100 వద్ద కొనసాగుతోంది.

► ఇక తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉంది.

► ఇక పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000 వద్ద కొనసాగుతోంది.

► అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,100 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 వద్ద కొనసాగుతోంది.

► అలాగే ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 వద్ద కొనసాగుతోంది.

► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం మార్పులు చేర్పులు ఉంటాయి. బంగారం ధరలు పెరగడానికి, తగ్గడానికి అనేక రకాల కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

N95 Mask: క్లాత్‌ మాస్క్‌ వాడుతున్నారా.. N95 మాస్క్ వాడుతున్నారా..! పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..

BSNL: నాలుగు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టిన BSNL .. జియో, ఎయిర్‌టెల్‌కి గట్టి పోటీ..

Booster Shot Scam: బూస్టర్ డోస్‌ స్కామ్‌.. వీరిని అస్సలు నమ్మకండి.. లేదంటే డబ్బులు మాయం..