Gold Price Today: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. శుక్రవారం ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

May 21, 2021 | 5:53 AM

Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలకు బ్రేక్ పడటం లేదు. ఇటీవల కాలంలో నిత్యం ధరలు పెరుగుతూనే

Gold Price Today: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. శుక్రవారం ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Price
Follow us on

Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలకు బ్రేక్ పడటం లేదు. ఇటీవల కాలంలో నిత్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్కెట్‌ ప్రకారం.. హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోకరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టిసారిస్తుంటారు. దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నెల క్రితం 40వేల చేరువలో ఉన్న బంగారం ధరలు.. ప్రస్తుతం 45 వేల మార్క్ దాటాయి. తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం 22 క్యారెట్ల తులం బంగారం.. రూ.46,000 గా ఉంది. అంటే.. 10 గ్రాముల బంగారంపై రూ. 350 పెరిగింది. అయితే.. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో ధరలు ఎంత మేర పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.49,750 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,750 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,750 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 46,930 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,830 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,000 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,000 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,750 వద్ద ఉంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,980 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,160 వద్ద కొనసాగుతోంది.

 

Also Read:

Hyderabad: ప్రేమిస్తున్నానంటూ.. పార్క్‌లో బాలికకు తాళికట్టిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

Waiter Murder for Chicken: చికెన్‌ ముక్కలు లేవన్నందుకు వెయిటర్‌ హత్య.. నలుగురి అరెస్ట్.. నిందితుల్లో ఇద్దరు మైనర్లు