Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు ఊరట.. వరుసగా రెండో రోజు కూడా..

|

Nov 20, 2023 | 6:26 AM

వరుసగా రెండు రోజులూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. ఆదివారం దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో మార్పులు కనిపించకపోగా, సోమవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు ఊరట.. వరుసగా రెండో రోజు కూడా..
Today Gold Price
Follow us on

బంగారం ధరలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 61వేలు దాటేసింది. కొన్ని నగరాల్లో అయితే రూ. 62 వేలకు కూడా చేరింది. ఇదిలా ఉంటే ప్రతి రోజూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్‌ పడింది.

వరుసగా రెండు రోజులూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. ఆదివారం దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో మార్పులు కనిపించకపోగా, సోమవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,700కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690గా ఉంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో సోమవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,000గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,180గా ఉంది.

* ఇక కోల్‌కతాలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690గా ఉంది.

* దేశంలోని మరో ప్రధాన నగరం బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 61,690 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690 వద్ద కొనసాగుతోంది.

* నిజామామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,690 వద్ద కొనసాగుతోంది.

* ఇక విజయవాడ విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 61,690 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,690గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 76,000గా ఉండగా.. చెన్నై, కేరళలో మాత్రం అత్యధికంగా కిలో వెండి ధర రూ. 79,000వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 79,000 గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..