Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

కొత్త ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. నిన్న మొన్నటి వరకూ తగ్గిన పసిడి ధరలు తిరిగి పుంజుకున్నాయి. ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
Gold Price

Updated on: Jan 20, 2024 | 6:16 AM

కొత్త ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. నిన్న మొన్నటి వరకూ తగ్గిన పసిడి ధరలు తిరిగి పుంజుకున్నాయి. ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 62,620 కాగా ఈరోజు రూ. 330 పెరిగి రూ. 62,950గా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,400 ఉండగా ఈరోజు రూ.57,700 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 300 పెరుగుదల కనిపించింది. ఇక వెండి విషయానికొస్తే నిన్నటి ధరలతో పోలిస్తే కిలోపై రూ.200 పెరిగింది. నిన్న కిలో వెండి ధర రూ. 77,000 కాగా ఈరోజు రూ. 77,200 కు చేరింది. ఇక హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

హైదరాబాద్..రూ. 62,950
విజయవాడ..రూ. 62,950
ముంబాయి..రూ. 62,950
బెంగళూరు..రూ. 62,950
చెన్నై..రూ. 63,380

ఇవి కూడా చదవండి

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

హైదరాబాద్..రూ. 57,700
విజయవాడ..రూ. 57,700
ముంబాయి..రూ. 57,700
బెంగళూరు..రూ. 57,700
చెన్నై..రూ. 58,100

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

హైదరాబాద్..రూ. 77,200
విజయవాడ..రూ. 77,200
చెన్నై..రూ. 77,200
ముంబాయి..రూ. 75,700
బెంగళూరు..రూ. 73,000

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us