ఈమధ్య కాలంలో బంగారం ధరలు క్రమంగా క్షీణిస్తున్నాయి. గడిచిన పది రోజుల్లో రూ.1000కి పైగా క్షీణించింది. గత ఏడాది డిశంబర్‌లో రూ. 63వేల వద్ద ఉన్న పసిడి ధరలు జనవరి మూడవ వారంలో రూ. 62వేలకు పడిపోయింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.
నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 62,950 కాగా ఈరోజు తులంపై రూ.330 తగ్గి రూ. 62,620కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,700 ఉండగా ఈరోజు రూ.57,400 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 300 తగ్గుదల కనిపించింది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్నటి ధరలతో పోలిస్తే చెప్పుకోదగ్గ మార్పులు ఏవీ కనిపించడం లేదు. అలాగే స్థిరంగా కొనసాగుతోంది. నిన్న కిలో వెండి ధర రూ. 77,400 కాగా ఈరోజు కిలోపై రూ. 400 తగ్గి 77,000కు చేరింది. ఇక హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..