Gold price: బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

|

Apr 19, 2024 | 6:35 AM

బంగారం పేరు వినగా వామ్మో అనే పరిస్థితి వచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్‌ హైకి గోల్డ్‌ రేట్స్‌ పెరిగాయి. సామాన్యులు ఇక బంగారం కొనలేరా అనేంతలా పరిస్థితులు మారాయి. కేవలం 2 నెలల్లోనే తులం బంగారం ధర ఏకంగా రూ. 11వేలు పెరిగింది అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన...

Gold price: బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
Gold Price Toady
Follow us on

బంగారం పేరు వినగా వామ్మో అనే పరిస్థితి వచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్‌ హైకి గోల్డ్‌ రేట్స్‌ పెరిగాయి. సామాన్యులు ఇక బంగారం కొనలేరా అనేంతలా పరిస్థితులు మారాయి. కేవలం 2 నెలల్లోనే తులం బంగారం ధర ఏకంగా రూ. 11వేలు పెరిగింది అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలకు ఈరోజు కాస్త బ్రేక్‌ పడింది. తగ్గిన ధర స్వల్పమే అయినా పెరుగుతోన్న ధరల నుంచి కాస్త ఉపశమనంగా చెప్పొచ్చు. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,790కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్‌ రూ. 73,940 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 67,640గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,790 వద్ద కొనసాగుతోంది.

* ఇక చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68,340కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.74,550గా నమోదైంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,640కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,790 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,640గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,790గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 67,640, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,790 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంధర రూ. 67,640గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,790 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరలో కూడా తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 86,400కి చేరింది. అలాగే ముంబయి, కోల్‌కతాతో పాటు ముంబయి వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 86,400 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 89,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..