Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Latest Gold Price: బులియన్‌ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold Price Today

Updated on: Sep 18, 2021 | 5:31 AM

Latest Gold Price: బులియన్‌ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతూ వస్తుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి పసిడి ధరలు దిగివస్తున్నాయి. శుక్రవారంతోపాటు.. శనివారం కూడా బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.45,390 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,390గా ఉంది. తులం బంగారంపై తాజాగా.. రూ.390 మేర ధర తగ్గింది. అయితే.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన రేట్ల వివరాలను ఓ సారి పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,390గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,690గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,350గా ఉంది.

Also Read:

GST Council Meeting: జోమాటో.. స్విగ్గీ జీఎస్టీ పరిధిలోకి.. వినియోగదారునికి ఇబ్బంది లేదు.. ఎలా అంటే..

OLA e Scooter: రెండు రోజులు.. 1100 కోట్లు.. చరిత్ర సృష్టించిన ఓలా స్కూటర్! మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us