గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూపోతున్నాయి. ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ.. తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతోంది. నెల వ్యవధిలో 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ. 9 వేలకుపైగా పెరిగింది. వచ్చే రెండు నెలల్లో తులం బంగారం లక్షకు కూడా చేరవచ్చునన్న అంటున్నారు. ఇలాంటి తరుణంలో బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. పసిడి ప్రియులకు ఊరటనిస్తూ.. ఇవాళ రేట్లు స్వల్పంగా తగ్గాయి.
ప్రస్తుతం 22 క్యారెట్ల తులం బంగారం రూ. 10 తగ్గి.. రూ. 67,940కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 తగ్గి.. రూ. 74,120కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,940కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 74,120 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,940కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,120 వద్ద ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,120కి చేరింది.
బంగారం ధరల మాదిరిగానే వెండి రేట్లు కూడా స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గురువారం వెండి ధరలు వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 86,400 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలలో కిలో వెండి ధర రూ. 89,900కి చేరింది.