Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

|

Apr 17, 2024 | 6:22 AM

Gold Price Today: బంగారం ధరలు రోజు రోజుకూ అంబరాన్నంటుతున్నాయి. పండుగల వేళ పసిడి ధరలకు రెక్కలొస్తున్నాయి. మొన్న ఉగాదికి పెరిగినట్లుగానే నేడు శ్రీరామనవమికి కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్నమొన్నటి వరకు స్వల్పంగా తగ్గిన పసిడి ఈరోజు మరోసారి పెరిగింది. దీనికి కారణం అంతర్జాతీయ అర్థిక స్థితిగతుల్లో నెలకొన్న మార్పులే అంటున్నారు నిపుణులు.

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
Gold Price Today
Follow us on

బంగారం ధరలు రోజు రోజుకూ అంబరాన్నంటుతున్నాయి. పండుగల వేళ పసిడి ధరలకు రెక్కలొస్తున్నాయి. మొన్న ఉగాదికి పెరిగినట్లుగానే నేడు శ్రీరామనవమికి కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్నమొన్నటి వరకు స్వల్పంగా తగ్గిన పసిడి ఈరోజు మరోసారి పెరిగింది. దీనికి కారణం అంతర్జాతీయ అర్థిక స్థితిగతుల్లో నెలకొన్న మార్పులే అంటున్నారు నిపుణులు. దీనికి తోడూ డాలర్ విలువలో వచ్చిన హెచ్చుతగ్గులు, స్టాక్ మార్కెట్ల ప్రభావం, ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న యుద్ద పరిస్థితులు అన్ని వెరసి పసిడి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.

ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24క్యారెట్ల 10 గ్రాముల స్పచ్ఛమైన బంగారం ధర రూ. 74,140గా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 67,960కి చేరుకుంది. కిలో వెండి ధర కూడా నిన్న మొన్నటి వరకు రూ. 90 వేల మార్క్ చేరింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 90,600వద్ద కొనసాగుతోంది. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు..

హైదరాబాద్ – రూ. 74,140
విజయవాడ – రూ. 74,140
చెన్నై – రూ. 74,960
ముంబై – రూ.74,140
బెంగళూరు – రూ.74,140

ఇవి కూడా చదవండి

22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు..

హైదరాబాద్ – రూ. 67,960
విజయవాడ – రూ. 67,960
చెన్నై – రూ. 68,710
ముంబై – రూ. 67,960
బెంగళూరు – రూ. 67,960

కిలో వెండి ధరలు..

హైదరాబాద్ – రూ. 90,600
విజయవాడ – రూ. 90,600
చెన్నై – రూ. 90,600
ముంబై – రూ. 87,100
బెంగళూరు – రూ. 85,600

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..