MS Dhoni: ధోనీ సంపాదన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. క్రికెట్‌లోనే కాదు వ్యాపారంలోనూ చాణక్యుడే..

ధోనీ మంచి క్రికెటర్ మాత్రమే కాదు. వ్యాపారాలు నిర్వహించడంలో దిట్ట. అనేక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాడు. కొన్ని సంస్థలకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. క్రికెటర్లలో అత్యంత సంపన్నుడిగా పేరుపొందాడు. ఈయన ఆస్తుల విలువ సుమారు రూ.1,040 కోట్ల కంటే ఎక్కువ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్కే)కు మహేంద్ర సింగ్ ధోనీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

MS Dhoni: ధోనీ సంపాదన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. క్రికెట్‌లోనే కాదు వ్యాపారంలోనూ చాణక్యుడే..
MS Dhoni
Follow us

|

Updated on: Apr 16, 2024 | 4:54 PM

మహేంద్రసింగ్ ధోనీ.. ఈ పేరు తెలియని వారు మనదేశంలో ఎవ్వరూ ఉండరు. ప్రపంచంలో క్రికెట్ ఆడే అన్ని దేశాల ప్రజలకూ మన ధోనీ పేరు పరిచయమే. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, ప్రతిభ ఆధారంగా మహోన్నత శిఖరాలు అధిరోహించాడు. అంతర్జాతీయ పోటీలలో కెప్టెన్ గా జట్టును విజయపథంలో నడిపించి దేశానికి ఎన్నో ట్రోఫీలు సాధించిపెట్టాడు. చిన్నపిల్లల నుంచి యువత వరకూ అందరికీ ఒక రోల్ మోడల్.

వికెట్ కీపర్ నుంచి కెప్టెన్ గా..

భారత క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ గా ధోనీ ప్రస్థానం మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగా కెప్టెన్ అయ్యాడు. నిలకడైన ఆటతీరు, అంతుచిక్కని వ్యూహాలతో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టించాడు. ప్రపంచ క్రికెట్ లో మన దేశాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్లాడు. ఇతడిని స్ఫూర్తిగా తీసుకునే అనేక మంది క్రికెట్ లో సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత కూడా ధోనీకి అభిమానుల ఆదరణ ఏమాత్తం తగ్గలేదు కదా.. ఇంకా పెరుగుతూనే ఉంది.

వ్యాపారవేత్త..

ధోనీ మంచి క్రికెటర్ మాత్రమే కాదు. వ్యాపారాలు నిర్వహించడంలో దిట్ట. అనేక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాడు. కొన్ని సంస్థలకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. క్రికెటర్లలో అత్యంత సంపన్నుడిగా పేరుపొందాడు. ఈయన ఆస్తుల విలువ సుమారు రూ.1,040 కోట్ల కంటే ఎక్కువ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్కే)కు మహేంద్ర సింగ్ ధోనీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ ప్రాంచైజీ నుంచి రూ.12 కోట్లు వసూలు చేస్తున్నాడు. దీనితో పాటు అతడికి కొన్ని వ్యాపారాలు, వివిధ సంస్థలలో పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కూడా ఉన్నాయి.

తాలా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ధోనీ ఈ సీజన్ లో సీఎస్కే జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయినా అతడి ప్రభావం ఏమీ తగ్గలేదు. ఇతడు సోషల్ మీడియా ఎండార్స్‌మెంట్‌ల కోసం రూ.కోటి నుంచి రూ. 2 కోట్ల వరకూ వసూలు చేస్తున్నాడు. తన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ డీల్స్ కోసం రూ. 4 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు. సెవెన్ అనే ప్రఖ్యాత దుస్తుల బ్రాండ్, ఒక స్పోర్ట్స్ కంపెనీతో పాటు రియల్ ఎస్టేట్‌లో వెంచర్లు కూడా ధోనీకి ఉన్నాయి.

  • మహేంద్ర సింగ్ ధోనికి తన సొంతూరు రాంచీలో మహి రెసిడెన్సీ అనే మధ్యతరగతి హోటల్ ఉంది. దీనికి ఎయిర్ బీఎన్బీ, ఓయో, మేక్ మై ట్రిప్‌ సంస్థలతో ఒప్పందం ఉంది. బెంగళూరులోని ఎస్ఎస్ ధోని గ్లోబల్ స్కూల్, 7ఇంక్ బ్రూస్ అనే పానీయాలు, చాక్లెట్ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. ధోనీ స్పోర్ట్స్ ఫిట్ అనే జిమ్ కు దేశ వ్యాప్తంగా 200కి పైగా బ్రాంచ్ లు ఉన్నాయి.
  • సిమెంట్స్ లిమిటెడ్ అనే సిమెంట్ కంపెనీకి ధోనీ వైస్ ప్రెసిడెంట్. చెన్నైకి చెందిన చెన్నైయిన్ ఎఫ్ బీ అనే ఫుట్‌బాల్ క్లబ్, రాంచీకి చెందిన రాంచీ రేస్‌ అనే హాకీ క్లబ్ కు సహ యజమాని. అలాగే కార్ 24 అనే వాహన రీసేల్ సంస్థకు పెట్టుబడి పెట్టడంతో పాటు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.
  • ధోనీకి మోటారు బైక్ లంటే చాలా ఇష్టం. అతడి దగ్గర నార్టన్ జూబ్లీ 250, కవాసకి నింజా హెచ్2, కాన్ఫెడరేట్ ఎక్స్132 హెల్‌క్యాట్ ఉన్నాయి. అలాగే నిస్సాన్ ఎస్ యూవీ జోంగ్, ల్యాండ్ రోవర్ 3 స్టేషన్ వ్యాగన్ సిరీస్, రోల్స్ రాయిస్ సివర్ వ్రైత్ II తదితర కార్లు కూ యజమాని.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles