Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందో తెలుసా..?

|

Oct 16, 2024 | 6:45 AM

బంగారం అంటేనే కొందరికి బలమైన సెంటిమెంట్. మరికొందరికి ఇన్వెస్ట్‌మెంట్ ఎలిమెంట్. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే మన దగ్గర ఉన్న బంగారమే మన ఆస్తి. అందుకే.. సంపన్నులకే కాదు.. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సైతం బంగారం ఒక పెట్టుబడి వస్తువుగా మారింది.

Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందో తెలుసా..?
Gold Price Today
Follow us on

పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు ధరలు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. అయితే.. మూడు నెలల క్రితం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. మళ్లీ పెరిగాయి. ముఖ్యంగా దీపావళి పర్వదినం ముందు పసిడి ధరలు పెరుగుతుండటంతో అందరి దృష్టి వీటిపైనే ఉంది.

తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. బుధవారం (16 అక్టోబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.70,940 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,390గా ఉంది. వెండి కిలో ధర రూ.96,800గా కొనసాగుతోంది. బంగారంపై రూ.10 మేర, వెండిపై రూ.100 మేర ధర తగ్గింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,940, 24 క్యారెట్ల ధర రూ.77,390 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,940, 24 క్యారెట్ల ధర రూ.77,390 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.71,090, 24 క్యారెట్ల ధర రూ.77,540 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.70,940, 24 క్యారెట్ల రేటు రూ.77,390 లుగా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.70,940, 24 క్యారెట్ల రేటు రూ.77,390

బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.70,940, 24 క్యారెట్ల ధర రూ.77,390లుగా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో వెండి కిలో ధర రూ.102,900, విజయవాడ, విశాఖపట్నంలో రూ.102,900లుగా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.96,900, ముంబైలో రూ.96,800, బెంగళూరులో రూ.91,900, చెన్నైలో రూ.102,900 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..