Gold Price Today: పసిడి ధరలు పైపైకి.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

Gold - Silver Price: బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో మధుపరులకు షాక్ ఇస్తోంది పసిడి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే అంటున్నారు నిపుణులు. డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, వడ్డీరేట్లలో మార్పులు వెరసి పసిడి ధరపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Gold Price Today: పసిడి ధరలు పైపైకి.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

Updated on: Apr 12, 2024 | 10:26 AM

బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో మధుపరులకు షాక్ ఇస్తోంది పసిడి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే అంటున్నారు నిపుణులు. డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, వడ్డీరేట్లలో మార్పులు వెరసి పసిడి ధరపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24గ్రాముల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 72,230గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి విలువ 10 గ్రాములు రూ. 66,210 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోలిస్తే తులంపై రూ. 10 పెరిగింది. అలాగే వెండి ధరల విషయానికొస్తే నిన్న కిలో వెండి ధర రూ.88,500 కాగా ఈరోజు కిలోపై రూ. 100 తగ్గి రూ. 88,400కు చేరింది. దేశంలోని పలు ప్రధాన పట్టణాలలో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

24 క్యారెట్ల 10 గ్రాముల ధర..

  • విజయవాడ : రూ.72,230
  • ముంబై : రూ.72,230
  • చెన్నై : రూ.73,370
  • బెంగళూరు : రూ.72,230
  • ఢిల్లీ : 72,380

22 క్యారెట్ల 10 గ్రాముల ధర..

  • విజయవాడ : రూ.66,210
  • ముంబై : రూ.66,210
  • చెన్నై : రూ.7,260
  • బెంగళూరు : రూ.66,210
  • ఢిల్లీ : రూ.66,360

కిలో వెండి ధరలు..

  • విజయవాడ : రూ.88,400
  • ముంబై : రూ.84,900
  • చెన్నై : రూ.88,400
  • బెంగళూరు : రూ.84,600
  • ఢిల్లీ : రూ.84,900

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..