Gold Price Today: తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే..

|

Jun 02, 2024 | 6:16 AM

బంగారం ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. తగ్గేదేలే అంటూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే.. కిందకి దిగిరావడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు ఆల్‌ టైం రికార్డు స్థాయి ధర పలుకుతోంది..

Gold Price Today: తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే..
Gold, Silver Price
Follow us on

బంగారం ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. తగ్గేదేలే అంటూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే.. కిందకి దిగిరావడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు ఆల్‌ టైం రికార్డు స్థాయి ధర పలుకుతోంది.. బంగారం 72 వేల మార్కును దాటగా.. వెండి రూ.84 వేల మార్కును దాటింది. దీంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం కూడా ధరలు పెరిగాయి. ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర అక్షరాలా 71 వేల 740 రూపాయలుగా ఉంది.. వెండి కేజీ రూ.83,400 లుగా ఉంది. ఇప్పుడే ధరలు ఇలా ఉంటే.. పెళ్లిళ్ల సీజన్‌ నాటికి ధరలు మరింత పెరుగుతాయన్న వ్యాపార వర్గాల అంచనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండికి భారీగా డిమాండ్ ఉండటంతో భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పుత్తడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,910, 24 క్యారెట్ల ధర రూ.71,890 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.65,760, 24 క్యారెట్లు రూ.71,740, చెన్నైలో 22క్యారెట్లు రూ.66,710, 24 క్యారెట్లు రూ.72,770, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.65,760, 24 క్యారెట్లు రూ.71,740 లుగా ఉంది.

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22క్యారెట్లు రూ.65,760, 24 క్యారెట్లు రూ.71,740 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.84,400, ముంబైలో రూ.84,400, బెంగళూరులో రూ.83,850, చెన్నైలో రూ.87,900, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.87,900 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..