Gold Price Today: మహిళలకు ఊరటనిస్తున్న బంగారం ధరలు.. స్వల్పంగా పెరిగిన సిల్వర్‌ ధర!

|

May 29, 2022 | 6:23 AM

Gold Price Today: దేశంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ధరలు పెరిగినా పసిడి వ్యాపారాలు జోరుగా కొనసాగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలుదారులకు ఊరట..

Gold Price Today: మహిళలకు ఊరటనిస్తున్న బంగారం ధరలు.. స్వల్పంగా పెరిగిన సిల్వర్‌ ధర!
Follow us on

Gold Price Today: దేశంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. ధరలు పెరిగినా పసిడి వ్యాపారాలు జోరుగా కొనసాగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలుదారులకు ఊరట లభించింది. పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది. నిన్న కూడా ఇదే ధరలు కొనసాగాయి. కాకపోతే దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉండేవి. ఇక మే 28న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.52,090 వద్ద ఉంది. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ఊర.47,750 ఉండా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద నమోదైంది.

ఇక పసిడి ధరలు స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.67,700 ఉండగా, ముంబైలో రూ.62,200 ఉంది, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,200 ఉండగా, కోల్‌కతాలో రూ.62,200 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో సిల్వర్‌ ధర రూ.67,000 ఉండగా, హైదరాబాద్‌లో రూ.67,000 ఉంది. ఇక కేరళలో రూ.67,000 ఉండగా, విజయవాడలో రూ.67,000 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి