Gold Rate Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. రూ.50 వేల మార్క్ దాటి..

|

Feb 11, 2022 | 5:30 AM

Latest Gold Price: పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తున్నాయి. వాస్తవానికి బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయన్న

Gold Rate Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. రూ.50 వేల మార్క్ దాటి..
Gold Rate Today
Follow us on

Latest Gold Price: పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తున్నాయి. వాస్తవానికి బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. నిత్యం మారుతున్న అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతుంటాయి. అందుకే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంటారు. కాగా.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు (Gold Price) పెరుగుతూ షాకిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం కూడా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.45,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.250 పెరిగితే.. 24 క్యారెట్లపై రూ.280 మేర పెరిగింది. కాగా.. చెన్నైలో తులం బంగారం రూ.50వేల మార్క్ దాటింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు (Gold Rate) ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 లుగా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,970 వద్ద కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 వద్ద కొనసాగుతోంది.

* పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 ఉంది.

* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,970 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 వద్ద కొనసాగుతోంది.

* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 గా ఉంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

TSRTC: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. గరుడ ఛార్జీలను భారీగా తగ్గించిన యాజమాన్యం..

Adani Wilmar: రూ. 50 వేల కోట్లకు చేరిన కంపెనీ విలువ.. మార్కెట్లోకి వచ్చిన మూడు రోజులకే..