Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

|

Mar 07, 2021 | 5:17 AM

Gold Price Today: పసిడి ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. ఆదివారం స్వల్పంగా పెరిగింది. పది...

Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Follow us on

Gold Price Today: పసిడి ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. ఆదివారం స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారంపై రూ.260 మేర పెరిగింది. అయితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ఎంత మేర తగ్గుతాయనేది స్పష్టంగా చెప్పలేమని పేర్కొంటున్నారు.

దేశీయంగా తాజాగా ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,510 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,990 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490 వద్ద ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,700, 24 క్యారెట్ల రూ.45,490 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490 ఉంది. కాగా, దేశీయంగా పసిడి ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల నుంచే బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఇవీ చదవండి :

PAN Card: ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులున్నాయా..? అయితే మీరు చిక్కుల్లో పడినట్లే.. భారీ పెనాల్టీ

National Pension System: కేంద్రం అనుమతి.. మీరు ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్నారా..? మీకో శుభవార్త