
Gold, Silver Prices Today: వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరల పతనం కొనసాగింది. సోమవారం పడిపోయిన తర్వాత, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో మంగళవారం వెండి ఫ్యూచర్స్ ధరలు తీవ్రంగా పడిపోయాయి. MCXలో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే, 1 కిలో వెండి ధర అకస్మాత్తుగా 5,200 రూపాయలకు పైగా పడిపోయి 2.31 లక్షల రూపాయలకు చేరింది. మరోవైపు, బంగారం ధర కూడా పడిపోవడంతో, దాని ఫ్యూచర్స్ ధర 1,500 రూపాయలకు పైగా తగ్గింది. తాజాగా జూలై 8వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,250 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,140 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,250 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,140 వద్ద కొనసాగుతోంది. అలాగే ఢిల్లీలో కాస్త తేడా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,290 వద్ద కొనసాగుతోంది.
ఇక చెన్నైలో ఇంకా ఎక్కువగా ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,170 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,990 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో సిల్వర్ ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతుండగా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇతర నగరాల్లో రూ.2,44,900 వద్ద ట్రేడవుతోంది.
ఈ వారం ప్రారంభం నుంచి మొదలైన వెండి ధరల తగ్గుదల, వరుసగా మూడో రోజు కూడా కొనసాగుతోంది. గత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం నాడు సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ. 2,37,410 వద్ద ముగియగా, ఈ మూడు రోజుల తగ్గుదలలో దాని ధర కిలోకు రూ. 6607 మేర తగ్గింది. ఈ తాజా తగ్గుదల తర్వాత, వెండి ఇప్పుడు తన జీవితకాల గరిష్ఠ స్థాయి అయిన రూ. 4.20 లక్షలతో పోలిస్తే భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి