భారీగా తగ్గిన బంగారం ధరలు

| Edited By:

Aug 02, 2019 | 10:08 AM

రోజురోజుకు ఆకాశాన్నంటున్న బంగారం ధరలు.. అప్పుడప్పుడు కాస్త తగ్గుతున్నాయి. ఈ క్రమంలో 24క్యారెట్ల బంగారం ధర ఈ రోజు ఏకంగా రూ.430 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.36,160లుగా ఉంది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జ్యూవెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో 22క్యారెట్ల బంగారం ధర కూడా రూ.230తగ్గుదలతో రూ.33,150కు క్షీణించింది. మరోవైపు వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతోంది. […]

భారీగా తగ్గిన బంగారం ధరలు
Follow us on

రోజురోజుకు ఆకాశాన్నంటున్న బంగారం ధరలు.. అప్పుడప్పుడు కాస్త తగ్గుతున్నాయి. ఈ క్రమంలో 24క్యారెట్ల బంగారం ధర ఈ రోజు ఏకంగా రూ.430 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.36,160లుగా ఉంది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జ్యూవెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో 22క్యారెట్ల బంగారం ధర కూడా రూ.230తగ్గుదలతో రూ.33,150కు క్షీణించింది.

మరోవైపు వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.44,965వద్ద స్థిరంగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.