బంగారం అమ్మడం Vs గోల్డ్ లోన్: రెండింటిలో ఏది బెస్ట్..? ఈ లెక్కలు తెలుసుకోండి..

Gold Loan: భారతీయ కుటుంబాల్లో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు ఆపత్కాలంలో ఆదుకునే అతిపెద్ద ఆర్థిక భరోసా. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చాలామంది తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్ముకోవాలా లేక దానిపై రుణం తీసుకోవాలా అనే సందిగ్ధంలో ఉంటారు. దీన్ని గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బంగారం అమ్మడం Vs గోల్డ్ లోన్: రెండింటిలో ఏది బెస్ట్..? ఈ లెక్కలు తెలుసుకోండి..
Selling Gold Vs Gold Loan

Updated on: Dec 28, 2025 | 1:43 PM

భారతీయ కుటుంబాల్లో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఆపత్కాలంలో ఆదుకునే అతిపెద్ద ఆర్థిక భరోసా. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. చాలామంది తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్ముకోవాలా లేక దానిపై రుణం తీసుకోవాలా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.

బంగారం అమ్మడం లాభమా? గోల్డ్ లోన్ తీసుకోవడం మేలా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనపడటం వంటి కారణాలతో పసిడి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2025లో ఇప్పటివరకు బంగారం 70శాతం, వెండి ఏకంగా 150శాతానికి పైగా లాభపడి 1979 నాటి రికార్డులను తిరగరాశాయి. ఈ క్రమంలో బంగారాన్ని నగదుగా మార్చుకునే విషయంలో ఈ కింది అంశాలను గమనించాలి.

అమ్మితే నష్టమా?

సాధారణంగా ఆభరణాలను అమ్మడం ఆర్థికంగా నష్టదాయకమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఆభరణాలను అమ్మేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటివి పోగా సుమారు 25శాతం విలువను మీరు వెంటనే కోల్పోతారు. భారతీయులకు బంగారం వారసత్వ సంపద. అమ్మడం వల్ల ఆ సెంటిమెంట్ దెబ్బతింటుంది. మళ్ళీ అదే నగలను కొనాలంటే రెట్టింపు ఖర్చు అవుతుంది.

ఇవి కూడా చదవండి

గోల్డ్ లోన్ ఎందుకు బెటర్

ఆర్‌బీఐ డేటా ప్రకారం.. 2025 అక్టోబర్‌లో గోల్డ్ లోన్లు 128.5శాతం పెరిగి రూ. 3.38 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీనికి కారణాలు.. రుణం తీసుకుంటే బంగారం మీ దగ్గరే ఉంటుంది. ధరలు పెరిగితే ఆ లాభం కూడా మీకే చెందుతుంది. ఏప్రిల్ 2026 నుండి అమలులోకి రానున్న నిబంధనల ప్రకారం.. రూ. 2.5 లక్షల లోపు రుణాలకు బంగారం విలువలో 85శాతం వరకు, రూ. 5 లక్షల పైన 75శాతం వరకు రుణం పొందవచ్చు. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 8శాతం నుండి 12.5శాతం మధ్య ఉంటాయి. ఇది పర్సనల్ లోన్ల కంటే చౌక.

పన్ను ప్రయోజనాలు

అమ్మితే పన్ను: బంగారాన్ని అమ్మితే వచ్చే లాభాలపై మూలధన లాభాల పన్ను చెల్లించాలి. 3 ఏళ్ల తర్వాత అమ్మితే ఇండెక్సేషన్ ప్రయోజనాలతో 20శాతం పన్ను పడుతుంది.

లోన్‌పై పన్ను లేదు: గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల ఎటువంటి పన్ను బాధ్యత ఉండదు. ఎందుకంటే ఇక్కడ యాజమాన్యం మారడం లేదు.

రుణదాతను ఎంచుకోవడం ఎలా?

వడ్డీ రేట్లు రుణదాతను బట్టి మారుతుంటాయి:

ప్రభుత్వ బ్యాంకులు: 8.05శాతం – 9.15శాతం

ప్రైవేట్ బ్యాంకులు: 8.75శాతం – 10.60శాతం

NBFCలు (ముత్తూట్, మణప్పురం వంటివి): 9శాతం – 27శాతం

అడుగు వేసే ముందు..

మీరు బంగారు రుణం తీసుకునే ముందు మీ యజమాని నుండి సాఫ్ట్ లోన్, కుటుంబ సభ్యుల నుండి సాయం లేదా మీ FD పాలసీలపై రుణం తీసుకునే అవకాశాలను పరిశీలించండి. ఇవి గోల్డ్ లోన్ కంటే తక్కువ ఒత్తిడితో కూడుకున్నవి. ఒకవేళ గోల్డ్ లోన్ తీసుకుంటే ఖచ్చితమైన తిరిగి చెల్లింపు ప్రణాళికను ముందే వేసుకోండి.. లేదంటే మీ సంపదను కోల్పోయే ప్రమాదం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి