Gold Rate Today: గుడ్ న్యూస్.. తగ్గుతోన్న బంగారం ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మార్కు దాటిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంత మేర తగ్గుతూ వచ్చాయి.. అనంతరం మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి.. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే 98వేల వరకు చేరుకున్నాయి..

Gold Rate Today: గుడ్ న్యూస్.. తగ్గుతోన్న బంగారం ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..
ఈ బంగారం ధరల మార్పుల వెనుక కీలక కారణంగా ప్రస్తుతం భారత్ - అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య వివాదం. అంటే సుంకాల యుద్ధం కనిపిస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్లపై, దేశీయ ఆర్థిక పరిస్థుతులపై ప్రభావం చూపుతుండటం వల్ల, బంగారం ధరలు కూడా పెరుగుతూనే, ఇప్పుడు కొంతమేర తగ్గింది.

Updated on: May 29, 2025 | 6:39 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మార్కు దాటిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంత మేర తగ్గుతూ వచ్చాయి.. అనంతరం మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి.. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే 98వేల వరకు చేరుకున్నాయి.. ఈ క్రమంలోనే.. తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. మే 29 2025 గురువారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 97,470 ఉండగా.. 22 క్యారెట్ల ధర 89,340 లుగా ఉంది.. పది గ్రాముల బంగారంపై రూ.10 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.100 తగ్గింది.. రూ.99,900 లుగా ఉంది.

బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,470గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,340లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.1,10,900లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,470గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 89,340లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,900 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,620గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,490లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.99,900లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.97,470, 22 క్యారెట్ల ధర రూ.89,340 గా ఉంది. వెండి ధర కిలో రూ.99,900లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.97,470, 22 క్యారెట్ల ధర రూ.89,340 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,900లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.97,470, 22 క్యారెట్ల ధర రూ.89,340 గా ఉంది. వెండి ధర కిలో రూ.99,900లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us