బ్రేకింగ్: భారీగా తగ్గిన వెండి ధర..!

| Edited By:

Sep 04, 2019 | 7:19 PM

పసిడి పైపైకి ఎగబాకుతూ.. అర లక్షకి చేరువలో ఉంది. అలాగే.. ఇప్పటి వరకూ వెండి ధరలు కూడా 40 వేలకు పైగా పెరుగుతూ.. 50 వేలకు పైగా చేరువయ్యింది. మొదటి నుంచీ.. కాస్త అటూ.. ఇటూగా.. పెరుగుతూ ఉన్నా.. కేంద్ర బడ్జెట్ ప్రేవేశ పెట్టిన తర్వాత నుంచీ ఈ ధరలు మరీ పెరుగుతూ.. వినియోగదారులకు షాకిస్తున్నాయి. అయితే.. కాస్త ఊరటనిస్తూ.. కేజీ వెండి ధర దాదాపు రూ.1,200ల తగ్గుదలతో రూ.49 వేలకు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు […]

బ్రేకింగ్: భారీగా తగ్గిన వెండి ధర..!
Follow us on

పసిడి పైపైకి ఎగబాకుతూ.. అర లక్షకి చేరువలో ఉంది. అలాగే.. ఇప్పటి వరకూ వెండి ధరలు కూడా 40 వేలకు పైగా పెరుగుతూ.. 50 వేలకు పైగా చేరువయ్యింది. మొదటి నుంచీ.. కాస్త అటూ.. ఇటూగా.. పెరుగుతూ ఉన్నా.. కేంద్ర బడ్జెట్ ప్రేవేశ పెట్టిన తర్వాత నుంచీ ఈ ధరలు మరీ పెరుగుతూ.. వినియోగదారులకు షాకిస్తున్నాయి. అయితే.. కాస్త ఊరటనిస్తూ.. కేజీ వెండి ధర దాదాపు రూ.1,200ల తగ్గుదలతో రూ.49 వేలకు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతోనే వెండి ధరలు తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

కాగా.. అలాగే.. పసిడి విషయానికొస్తే.. హైదరాబాద్‌లో ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రామాలు 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.300ల పెరుగుతూ.. 40,300లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర రూ.38 వేలుగా ఉంది. రూపాయి విలువ పతనం కావడంతో.. బంగారం ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రకంగా చూస్తే.. మధ్యతరగతి ప్రజలకు బంగారం.. ఆమడదూరంగానే ఉండబోతుందా..? ఇక మరలా.. బంగారం ధరలు తగ్గవా..! అంటే.. పడిసి దుకాణాదారులు మాత్రం ఇకపై మరింత పెరుగుతాయే తప్ప.. తగ్గే ఛాన్స్ లేదని అంటున్నారు.