Gold Price Today: బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గత వారం నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. తాజాగా కూడా అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. తులం ధర లక్షా 30వేలు దాటిన పసిడి.. ప్రస్తుతం భారీగానే దిగి వస్తోంది. వెండి కూడా అదే దారిలో వెళ్తోంది. కిలో వెండి ధర 2 లక్షల రూపాయల వరకు వెళ్లగా, ఇప్పుడు కిలో వెండి ధర లక్షా 50 వేల వరకు ఉంది.
బంగారం, వెండి ధరలలో తగ్గుదల కొనసాగుతోంది. గత 14 ట్రేడింగ్ రోజులలో కొన్ని లాభాలు మినహా, రెండు విలువైన లోహాల ధరలు తగ్గాయి. బంగారం, వెండి ధరలు వాటి గరిష్ట స్థాయిల నుండి బాగా పడిపోయాయి. తాజాగా నవంబర్ 10న దేశీయంగా తులం బంగారం ధర రూ.1,22,010 వద్ద కొనసాగుతోంది. అదే కిలో వెండి ధర రూ.1,52,400 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 10, 11న పాఠశాలలకు సెలవు!
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,160 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,990 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,010 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,840 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,010 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,840 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,010 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,840 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,990 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,010 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,840 వద్ద కొనసాగుతోంది.
- కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,010 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,840 వద్ద కొనసాగుతోంది.
- ఇక వెండి ధర కిలోకు 1,52,400 వద్ద ఉంది. ఇక హైదరాబాద్, కేరళ, చెన్నైలలో మాత్రం భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.1,64,900 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Multibagger: ఆ ఇన్వెస్టర్లు జాక్‌పాట్ కొట్టేశారు.. కేవలం 10 నెలల్లోనే అదృష్టం తెచ్చిపెట్టిన 5 స్టాక్‌లు!
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 10, 11న పాఠశాలలకు సెలవు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి