
Gold And Silver Price In Hyderabad – Vijayawada: బంగారం ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి.. ఇటీవల లక్ష రూపాయలకుపైగా పరుగులు పెట్టిన పసిడి ధర ఇప్పుడు కొంత మేరకు వెనక్కి తగ్గింది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయన్న వార్తలతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. రికార్డు స్థాయికి చేరిన కొన్ని రోజుల్లోనే దాదాపు 5వేల వరకు బంగారం ధర తగ్గింది. ఇటీవల లక్షా రెండు వేలకు పైగా పెరిగిన తులం బంగారం ధర.. ఇప్పుడు దాదాపు 97 వేలుగా ఉంది.. అయితే.. డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గడంతో భవిష్యత్తులో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.. వాస్తవానికి పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. అయితే.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. జూన్ 29 2025 ఆదివారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 97,420 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,300 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,07,800లుగా ఉంది.
గమనిక, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు.. ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..