Gold and silver rate today : మగువలకు శుభవార్త.. స్థిరంగా బంగారం ధర, తగ్గిన వెండి..ఎంతంటే..!

|

Aug 05, 2023 | 7:12 AM

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 99.9 గ్రాములు, 23 క్యారెట్‌లపై 95.8, 22 క్యారెట్‌లపై 91.6, 21 క్యారెట్‌పై 87.5, 18 క్యారెట్‌పై 75.0 గ్రాముల స్వచ్ఛత రాసి ఉంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు.

Gold and silver rate today : మగువలకు శుభవార్త.. స్థిరంగా బంగారం ధర, తగ్గిన వెండి..ఎంతంటే..!
Gold Price Today
Follow us on

గత కొన్ని రోజులుగా బంగారం ధర నిరంతరం మారుతూ వస్తోంది. ఒక రోజు పెరుగుతుంది, మరొక రోజు తగ్గుతుంది. ఇప్పుడు గత పదిరోజుల వృద్ధిని పరిశీలిస్తే బంగారం ధర తగ్గుముఖం పడుతూ వస్తోంది. వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. మీరు కూడా బంగారం, వెండిని కొనుగోలు చేయడానికి ఈ రోజు మార్కెట్‌కి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ కోసం ఒక ముఖ్యమైన వార్త. ఈ రోజు అంటే శనివారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇక వెండి విషయానికి వస్తే..ఈ రోజు వెండి ధరలో తగ్గుదల నమోదైంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

దేశవ్యాప్తంగా బంగారం ధరలు..

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మార్కెట్లలో బంగారం ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 54,950గా ఉంది. నిన్న(శుక్రవారం) కూడా ఇదే పలికింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,100గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,100గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,350గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,380గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల పసిడి ధరలు రూ. 54,950గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 59,950గాను ఉంది. అటు, వాణిజ్య రాజధాని ముంబై, ఐటీ రాజధాని బెంగళూరులోనూ బంగారం ధరలు ఇదే విధంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అటు కోల్‌కత్తాలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,950 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 59,950గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, పట్టణాల్లో బంగారం, వెండి ధరలు పరిశీలించినట్టయితే హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 54,950గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 59,950గా నమోదైంది. వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మంలోనూ బంగారం ధరలు ఒకే విధంగా స్థిరంగా ఉన్నాయి. అటు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోలో సైతం రేటు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వెండి ధరలు..

దేశంలో వెండి ధరలు శనివారం మరింత పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,480గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 200 తగ్గి.. రూ. 74,800కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 75,000గా ఉండేది. కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 78,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,800.. బెంగళూరులో రూ. 74,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ కేజీ వెండి ధర 78,200 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..