Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!

Gold Price Today: శుభకార్యాల్లో బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి బంగారం ధరలు గత కొన్ని రోజులనుంచి చుక్కలు చూపిస్తున్నాయి. ఇక జూన్‌ 8వ తేదీన బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటి ధరలతో పోల్చుకుంటే తులం బంగారంపై ఏకంగా..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!

Updated on: Jun 08, 2025 | 6:20 AM

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. ఇక బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పసిడి భారత దేశ సంస్కృతిలో ఓ ప్రత్యేక స్థానముంది. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలోనే ఎక్కువ బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా ఏ మాత్రం తగ్గరు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు బంగారం వైపు ఎక్కువ మొగ్గుచూపుతూ ఉంటారు. అన్ని శుభకార్యాల్లో బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి బంగారం ధరలు గత కొన్ని రోజులనుంచి చుక్కలు చూపిస్తున్నాయి. ఇక జూన్‌ 8వ తేదీన బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటి ధరలతో పోల్చుకుంటే తులం బంగారంపై ఏకంగా రూ.1600కుపైగా తగ్గుముఖం పట్టింది. ఇటీవల లక్ష రూపాయలు దాటి బంగారం ధర.. క్రమంగా దిగి వచ్చింది. మళ్లీ లక్షకు చేరువలో ఉండగా, ఈ రోజు మాత్రం భారీగానే దిగి వచ్చింది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,970 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,000 రూపాయల వద్ద ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బ ంగారం ధర 98,120 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల తులం ధర 89,950 రూపాయలు ఉంది.

ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,970 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,000 రూపాయల వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,970 రూపాయల వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,800 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర లక్షా 8 వేల రూపాయల వద్ద ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో లక్షా 18 వేల వరకు ఉంది. అయితే ఈ ధరలు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుంది. జీఎస్టీ, ఇతర ఛార్జీలు కలిపి ధరలు మరింత పెరుగుతాయని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: WhatsApp Ban: వాట్సాప్‌ను బ్యాన్‌ చేసిన 6 దేశాలు ఏవో తెలుసా..? కారణం ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి