బంగారం ధర జెట్ స్పీడ్‌తో పైకి దూసుకెళ్తుంది. గత ఏడాది కాలంలోనే ఊహించనంత పెరిగి మధ్యతరగతి వారికీ అందుబాటులో లేకుండా పోయింది. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో.. పెట్టుబడిదారుల కూడా బంగారం వైపే చూస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తూ ఉండటంతో.. బంగారం రేటు స్వల్పంగా అయినా తగ్గితే కొనుక్కోవాలని కొందరు భావిస్తున్నారు. అందుకే మీ ముందు లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తీసుకువచ్చాం..
హైదరాబాద్‌లొ గోల్డ్ రేట్స్ వరుసగా రెండో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 10వ తేదీన ఉదయం 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 71 వేల 300గా ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులం రూ. 77 వేల 780 గా కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ రేట్లు ఇంచుమించు ఇలానే ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే బంగారం రేటు కాస్త ఎక్కవగానే ఉంది. 22 క్యారెట్ల రేటు తులానికి రూ. 71 వేల 300 వద్ద ట్రేడ్ అవుతతోంది. 24 క్యారెట్ల బంగారం రేట రూ.77 వేల 770 వద్ద ఉంది.
మంగళవారం వెండి రేటు మాత్రం స్వల్పంగా తగ్గిందిహైదరాబాద్‌లో కిలో వెండి ధర 100 రూపాయలు తగ్గి.. రూ. 99 వేల 900 వద్దకు చేరింది. అటు ఢిల్లీలో మాత్రం కిలో వెండి రేటు 92 వేల రూపాయలగా ట్రేడ్ అవుతోంది. ఇకపోతే ఈ ధరలు మధ్యాహ్నానానికి మారే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి