Gold, Silver Prices Crash: బంగారం, వెండి ప్రియులకు పండగే.. భారీ పతనం.. కేజీ వెండిపై లక్షన్నర తగ్గుదల!

Gold and Silver Prices Crash: బంగారం, వెండి ధరల్లో చోటుచేసుకున్న ఈ భారీ మార్పులు వినియోగదారులకు పండగ ముందే వచ్చినట్లుగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్షయ తృతీయ ఏప్రిల్ 19, 2026) కు ఒక్క రోజు ముందు ఈ స్థాయిలో ధరలు తగ్గడం విశేషం.

Gold, Silver Prices Crash: బంగారం, వెండి ప్రియులకు పండగే.. భారీ పతనం..  కేజీ వెండిపై లక్షన్నర తగ్గుదల!
Gold Rate

Updated on: Apr 18, 2026 | 5:45 PM

Gold and Silver Prices Crash: గత కొన్ని నెలలుగా ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి అందని ద్రాక్షలా మారిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా దిగివచ్చాయి. జనవరి చివరి వారంతో పోలిస్తే ప్రస్తుతం పసిడి ధర సుమారు రూ. 23,000 తగ్గగా, వెండి ధర ఏకంగా రూ. 1,45,000 మేర పతనమైంది.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: చమురు ధరల పతనం.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గనున్నాయా..?

హైదరాబాద్‌లో నేటి ధరలు (ఏప్రిల్ 18, 2026):

ఇవి కూడా చదవండి

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,55,780 (జనవరిలో ఇది రూ.1,78,850 వద్ద ఉండేది).

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,42,800 (జనవరిలో ఇది రూ.1,63,950 వద్ద ఉండేది).

వెండి (కిలో): రూ.2,80,000 (జనవరిలో ఇది రూ.4,25,000 గరిష్ట స్థాయిని తాకింది).

ధరలు ఎందుకు తగ్గాయి?

బంగారం, వెండి ధరల పతనానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి:

అంతర్జాతీయ పరిణామాలు: అమెరికా ఆర్థిక విధానాల్లో మార్పులు, డాలర్ విలువ పెరగడం వల్ల ఇన్వెస్టర్లు బంగారాన్ని వదిలి డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు.

దిగుమతి సుంకం తగ్గింపు: భారత ప్రభుత్వం బడ్జెట్‌లో బంగారంపై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్‌లో ధరలు భారీగా తగ్గాయి.

ప్రాఫిట్ బుకింగ్: గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు దిగివచ్చాయి.

కొనుగోలుదారులకు ఇది ‘గోల్డెన్’ టైమ్!
పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయ వేళ ఈ తగ్గింపు మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప ఊరట. గతంలో లక్షన్నర దాటిన బంగారం ధరను చూసి భయపడిన వారు, ఇప్పుడు తులం బంగారం ధరలో సుమారు 23 వేల రూపాయల ఆదా కనిపిస్తుండటంతో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.

నిపుణుల సూచన: మార్కెట్ ఎప్పుడూ ఒడిదుడుకులకు లోనవుతుంది. ధరలు మరింత తగ్గుతాయని వేచి చూడటం కంటే, పండుగ సీజన్ దృష్ట్యా ప్రస్తుత ధరల వద్ద కొనుగోలు చేయడం లాభదాయకమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Baba Vanga: వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర భవిష్యవాణిలు నిజమైతే ఏమవుతుంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us