Gold and Silver Price Today: దేశీయంగా పెరిగిన బంగారం ధర.. మరి కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా..!

Gold and Silver Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు...

Gold and Silver Price Today: దేశీయంగా పెరిగిన బంగారం ధర.. మరి కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా..!

Updated on: Jun 30, 2021 | 6:21 AM

Gold and Silver Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా బుధవారం దేశీయంగా బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 10 గ్రాములపై రూ. 400లకుపైగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగింది. మరి కొన్ని ప్రాంతాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,670 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,220 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది.

వెండి ధరలు

ఇక వెండి ధరల్లో కూడా దేశీయంగా రూ.100 వరకు పెరుగగా, హైదరాబాద్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో రూ.100 తగ్గుముఖం పట్టింది. మరి కొన్ని ప్రాంతాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, చెన్నైలో రూ.73,500 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కోల్‌కతాలో రూ.67,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కేరళలో రూ.67,900 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,500 ఉండగా, విజయవాడలో రూ.73,500 వద్ద కొనసాగుతోంది.

అయితే బుధవారం ఉదయం 6 గంటలకు నమోదైన ధరలు ఇవి. ఇంకా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసేవారు ఆ సమయానికి ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లాలని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి

RBI: అవుట్‌ సోర్సింగ్‌ పాలసీపై మార్గదర్శకాలను విడుదల చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ కొన్న వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. కొత్త సర్వీసు ప్రారంభం..!

Loading...
Unable to load recommendations.
Follow Us