బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. రెండు రోజుల్లోనే తులం బంగారంపై ఏకంగా రూ. 900కిపైగా పెరిగగా.. తాజాగా అక్టోబర్ 1వ తేదీన రూ. 160 తగ్గింది. అయితే గత రెండు రోజులుగా బంగారం ధరలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే దీపావళి నాటికి మాత్రం బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి సోమవారం దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 46,650 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,890 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 50,730 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,160 గా వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో సోమవారం 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 46,550, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 50,780గా ఉంది.
* హైదరాబాద్‌లో సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,730 గా ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,500, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,730 గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,730 గా ఉంది.
వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి..
న్యూఢిల్లీలో సోమవారం కిలో వెండి ధర రూ. 56,900 కాగా, ముంబైలో రూ. 56,900, చెన్నైలో రూ. 62,000, బెంగళూరులో రూ. 62,000 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రూ. 62,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..