Telugu News Business Gold and Silver Price: September 30th 2022 Gold Silver Rate in Vijayawada Hyderabad Mumbai Delhi Chennai Today Gold News
Gold Silver Price: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో..
బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పసిడి, వెండి భారీగా పెరిగాయి. వాస్తవానికి మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటాయి.
బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పసిడి, వెండి భారీగా పెరిగాయి. వాస్తవానికి మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటాయి. రేట్లు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.46,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.600, 24 క్యారెట్లపై రూ.650 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి రూ. 1400 మేర పెరిగి.. రూ.56,400 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 లుగా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050గా కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,620 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620గా కొనసాగుతోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.