మన దేశంలో బంగారం కొనాలనుకునే పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. గత కొన్ని రోజుల క్రితం ఆల్ టైం హై కి చేరుకున్న పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. మరోవైపు కిలో వెండి లక్ష దాటి షాక్ ఇవ్వగా… క్రమంగా బంగారం బాటలోనే రజతం కూడా పయనిస్తూ పుత్తడి, వెండి కొనాలనుకునే వారికి కొంత మేర ఉపశమనం కల్గిస్తున్నాయి. జూన్ 4 వ తేదీ మంగళవారం బహిరంగ మార్కట్ లో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వచ్చాయి. భారత దేశంలో ఈ రోజు 10 గ్రాముల 24 కేరెట్లు ప్యూర్ గోల్డ్ ధర రూ. 440 తగ్గగా.. 22 కేరెట్లు పసిడి 10 గ్రాముల ధర రూ. 400 చొప్పున తగ్గాయి. అదే సమయంలో కిలో వెండి కూడా రూ. 700మేర తగ్గింది.
ఈ రోజు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో సహా దేశంలో ప్రధాన నగరాల్లో ఎ విధంగా పసిడి, వెండి ధరలు ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 కేరెట్లు ప్యూర్ గోల్డ్ ధర రూ. 440 తగ్గి నేడు రూ. 72,110 వద్ద కొనసాగుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,100కు చేరుకుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ లలో కూడా కొనసాగుతున్నాయి.
పసిడి తర్వాత అంత ఆదరణ కలిగిన లోహం వెండి. ఈ నేపధ్యంలో రోజు రోజుకీ వెండికి కూడా భారీ డిమాండ్ ఏర్పడుతోంది. గత కొన్ని రోజుల క్రితం కిలో వెండి లక్ష దాటి షాక్ ఇవ్వగా.. క్రమంగా దిగి వస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 700ల మేర తగ్గి నేడు 97,300 గా ఉంది. ఇదే ధరలు హైదరాబాద్ , విజయవాడ , విశాఖ లతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి, వెండి లోహాల ధరల్లో హెచ్చుతగ్గుల ఆధారంగా మన దేశంలో కూడా వీటి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..