Gold Rates: బంగారం రూ.3 వేలు.. వెండి రూ.14 వేలు డౌన్.. కొనుగోలు చేసేవారికి భారీ ఊరట..

బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? అయతే మీకో శుభవార్త. ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ వారంలో ధరలు కుప్పకూలాయి. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం, యూఎఫ్ ఫెడ్ వడ్డీ రేట్లపై ప్రకటన క్రమంలో పసిడి ధరలు దిగొచ్చాయి. ఈ వారంలో ధరలు ఎలా కొనసాగాయంటే..

Gold Rates: బంగారం రూ.3 వేలు.. వెండి రూ.14 వేలు డౌన్.. కొనుగోలు చేసేవారికి భారీ ఊరట..
Gold Prices

Updated on: Jun 20, 2026 | 1:19 PM

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం, వెండి రేట్లు తగ్గుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలైన క్రమంలో ధరలు దిగిరావడం ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఈ వారం మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ట్రేడింగ్ జరిగిన ఐదు రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.3,380 తగ్గగా.. వెండి ధర రూ.13,830 పడిపోయింది. ఇరాన్-అమెరికా మధ్య కీలకమైన శాంతి ఒప్పందం ఈ వారంలోనే జరిగింది. అలాగే యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా స్దిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. రెండు అంశాలతో గోల్డ్ రేట్లు పడిపోయాయి. గత వారంలో బంగారం, వెండి ధరలలోని హెచ్చుతగ్గులను ఒకసారి వివరంగా చూద్దాం.

రూ. 3,380 తగ్గిన బంగారం

జూన్ 14న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150,910గా ఉంది. జూన్ 15న ఒక్కసారిగా పెరిగిన తర్వాత రూ.1.53 లక్షలను దాటింది. జూన్ 16న కూడా ఈ పెరుగుదల ధోరణి కొనసాగింది. అనంతరం బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. జూన్ 17న రూ.1.53 లక్షల వద్ద ముగియగా.. చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం రూ.1,47,530కి పడిపోయింది. ఈ విధంగా ఐదు రోజుల్లో మొత్తం రూ.3,380 మేర పడిపోయాయి.

రూ. 13,830 తగ్గిన సిల్వర్

ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఐదు రోజుల్లో కేజీ సిల్వర్ రూ.14 వేలు తగ్గింది భారీ ఉపశమనాన్ని కలిగించింది. వారంలో రోజున 999 స్వచ్ఛత గల వెండి కిలోగ్రాముకు రూ.2,47,650 వద్ద ప్రారంభమైంది. అనంతరం జూన్ 19న రూ.2,33,820కి పడిపోయింది.

ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..?

ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు స్ధిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,46,080 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,33,900గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.200 మాత్రమే పెరిగాయి. అటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది.

Follow Us