
బంగారం ధరలు తగ్గడం లేదు. రోజురోజుకి పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ కొట్టేలా ఉన్నాయి. గత వారంలో గోల్డ్ రేట్లు రూ.3 వేల మేర పెరగ్గా.. ఈ వారంలో కూడా అదే బాటలో నడుస్తున్నాయి. సోమవారం నుంచి రేట్లు తగ్గేదేలే అన్నట్లు హైక్ అవుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత నెలకొన్న క్రమంలో గోల్డ్ రేట్లు పెరుగుతున్నట్లు బిజినెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బుధవారం మరోసారి బంగారం, వెండి ధరలు పెరగ్గా.. వివిధ ప్రాంతాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,49,790 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,49,780 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్లు చూస్తే ప్రస్తుతం రూ.1,37,310 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,37,300 వద్ద స్ధిరపడింది
-విజయవాడలో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రేట్లు రూ.1,49,790 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,37,310 వద్ద స్దిరపడింది
-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రేటు రూ.1,51,650 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,010 వద్ద ఉంది
-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,790 వద్ద ప్రస్తుతం కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,310 వద్ద కొనసాగుతోంది
-ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,49,920గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,37,460 వద్ద కొనసాగుతోంది
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.3,20,100 వద్ద కొనసాగుతోంది
-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.3,40,100గా ఉంది. నిన్న ఆ ధర రూ.3,40,000 వద్ద స్థిరపడింది
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.3,40,100గా ఉండగా.. నిన్న రూ.3,40,000 వద్ద స్థిరపడింది
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.3,20,100 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.3,20,000 వద్ద స్ధిరపడింది