UPI Global Acceptance: గుడ్‌న్యూస్.. భారత్- సింగపూర్ మధ్య డిజిటల్ చెల్లింపులు ఇక చాలా ఈజీ..

డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్- సింగపూర్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. భారత్ UPI, సింగపూర్‌కు చెందిన పెనౌ మధ్య డిజిటల్ చెల్లింపు ఒప్పందంతో రెండు దేశాల పౌరులు చాలా సులభంగా వీటి సేవలను పొందుతారు.

UPI Global Acceptance: గుడ్‌న్యూస్.. భారత్- సింగపూర్ మధ్య డిజిటల్ చెల్లింపులు ఇక చాలా ఈజీ..
Pm Modi And Singapore Prime Minister Launch Real Time Payment Systems

Updated on: Feb 21, 2023 | 12:28 PM

డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్ ఈరోజు భారీ ఒప్పందంపై సంతకాలు చేశారు. భారతదేశం యూపీఏ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్, సింగపూర్‌లోని PayNowని కనెక్ట్ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ చెల్లింపు కనెక్టివిటీ ప్రారంభించబడింది. ఈ ఉదయం రెండు దేశాల ప్రధానులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరు దేశాల అధికారులు డిజిటల్ చెల్లింపు ఒప్పందాన్ని ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని భారతదేశం నుంచి ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ నుంచి మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ ప్రారంభించారు.

భారత్ – సింగపూర్ మధ్య రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ లింకేజీ మొదలు పెట్టారు. దీని ద్వారా, భారత్- సింగపూర్ మధ్య సరిహద్దు కనెక్టివిటీ కింద డబ్బును చాలా సులభంగా, త్వరగా బదిలీ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. బ్యాంకులతో పనిలేకుండానే ఆర్థిక లావాదేవీలను సులభంగా, త్వరగా చేయడానికి అవకాశం ఉండడంతో యూపీఐ సేవలకు మంచి ప్రజాధారణ లభించింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పారంటే..

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ సందర్భం ఇరు దేశాలకు ఎంతో అభినందనీయమన్నారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భారత్‌- సింగపూర్ ప్రజలను నేను అభినందిస్తున్నాను. సింగపూర్‌లో నివసించే భారతీయులు యూపీఐ ద్వారా భారత్‌కు సులభంగా నగదు బదిలీ చేయడం డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక చారిత్రాత్మక విజయమని ఆయన అన్నారు. ఇరు దేశాల పౌరులు తమ మొబైల్‌లలో ఒకరి దేశాల ప్రజలకు డబ్బును పంపుకోవచ్చు.. స్వీకరించగలరు. విద్యార్థులు, బిజినెస్ చేవారు, సాధారణ పౌరులు దీని ద్వారా ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు.

రెండు దేశాల మధ్య డిజిటల్ లావాదేవీలు ఇక ఈజీ..

నేటి నుండి, UPI, PayNow ఉపయోగించి, సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయులు UPI ద్వారా భారతదేశానికి డబ్బును బదిలీ చేయగలరు. సింగపూర్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేయడం ద్వారా UPI ద్వారా డబ్బు పంపగలరు.

మరన్ని బిజినెస్ వార్తల కోసం