LPG Connection: కొత్తగా గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? మిస్డ్ కాల్‌ ఇస్తే చాలు. ఇంటి వద్దకే సేవలు..

|

Sep 07, 2021 | 6:13 PM

LPG Connection: కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలని చాలా మంది ప్లాన్‌ వేస్తుంటారు.. కానీ గ్యాస్‌ ఆఫీసు ఎక్కడ ఉందో అడ్రస్‌ తెలుసుకొని, ఎలా అప్లై చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు...

LPG Connection: కొత్తగా గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? మిస్డ్ కాల్‌ ఇస్తే చాలు. ఇంటి వద్దకే సేవలు..
Follow us on

LPG Connection: కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలని చాలా మంది ప్లాన్‌ వేస్తుంటారు.. కానీ గ్యాస్‌ ఆఫీసు ఎక్కడ ఉందో అడ్రస్‌ తెలుసుకొని, ఎలా అప్లై చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. తెలిసిన వారికి ఫోన్‌ చేసి, గ్యాస్‌ ఆఫీసు ఎక్కడుందో తెలుసుకొని వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌ అంతటికీ చాలా సమయం పడుతుంది. అయితే వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే క్రమంలోనే ఇండియన్‌ ఆయిల్‌ తాజాగా మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇకపై కొత్త గ్యాస్‌ కలెక్షన్‌ తీసుకోవడాన్ని చాలా సులభతరం చేసింది. కేవలం మొబైల్‌ ఫోన్‌ నుంచి మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు ఇంటి వద్దే గ్యాస్‌ కనెక్షన్‌ పొందే వెసులుబాటు కలిపించింది.

ఈ విషయమై ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అధికారిక ట్విట్టర్‌ పేజీలో ఓ పోస్ట్‌ చేసింది. కొత్తగా గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలనుకుంటోన్న వారు 8454955555 నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు.. సంబంధిత వ్యక్తులు మీ ఇంటి వద్దకే వచ్చి కనెక్షన్‌ అందిస్తారు. ఇదిలా ఉంటే కొత్త కనెక్షన్‌ మాత్రమే కాకుండా అంతకుముందు గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారు కూడా ఈ నెంబర్‌కు తమ రిజిస్టార్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి మిస్డ్‌ కాల్‌ ఇచ్చి.. గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చు.

ఇండియన్ గ్యాస్ ట్వీట్..

ఇదిలా ఉంటే ఇండియన్‌ ఆయిల్‌ కేవలం ఈ విధానంతోనే కాకుండా పలు ఇతర పద్ధతుల ద్వారా కూడా గ్యాస్ బుక్‌ చేసుకునే అవకాశాన్ని కలిపించింది. అవేంటంటే..
* 7588888824 అనే వాట్సాప్‌ నెంబర్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.
* 7718955555 నెంబర్‌కు టెక్ట్స్‌ మెసేజ్‌ ద్వారా కూడా గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చు.
* ఇండియన్‌ ఆయిల్‌ వన్‌ యాప్‌ ద్వారా.
* ఆన్‌లైన్‌ పోర్టల్‌ cx.indianoil.in ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

Also Read: ఏకంగా ముఖ్యమంత్రి తండ్రినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎక్కడ..? ఎందుకు..? పూర్తి వివరాలు

Tirumala Darshan: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి తిరుమలలో ఉచిత దర్శనాలు..

Hyderabad: నగరంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ.. పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టిన హెచ్‌ఎమ్‌డీఏ.