దేశంలో డిసెంబర్ 3, శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా ఉంచారు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41గా ఉంది. డీజిల్ లీటర్ రూ. 86.67గా ఉంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది.బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.79గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.90గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.25గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.11గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.50కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.46లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.32 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.52గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.02గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.13గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.67 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.74లకు లభిస్తోంది.
Read Also… WhatsApp: వాట్సప్‌లో ఉబర్ రైడ్ బుక్ చేసుకోవచ్చు.. మొదటగా అక్కడ ప్రారంభం..