Fuel Price Today: పెరుగుతోన్న పెట్రోల్‌ ధరల నుంచి కాస్త ఉపశమనం.. ఈరోజు ఇంధన‌ ధరలు ఎలా ఉన్నాయంటే..

Fuel Price Today: గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ.100కు చేరింది. ఇక డీజిల్‌ కూడా పెట్రోల్‌తో పోటీపడి మరీ పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే..

Fuel Price Today: పెరుగుతోన్న పెట్రోల్‌ ధరల నుంచి కాస్త ఉపశమనం.. ఈరోజు ఇంధన‌ ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated on: Mar 05, 2021 | 7:27 AM

Fuel Price Today: గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ.100కు చేరింది. ఇక డీజిల్‌ కూడా పెట్రోల్‌తో పోటీపడి మరీ పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే రోజుకు కొంత పెరుగుతూ వస్తున్న ధరలకు శుక్రవారం కాస్త బ్రేక్‌లు పడినట్లు కనిపిస్తోంది. గురువారంతో పోలిస్తే.. శుక్రవారం ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా (గురువారం రూ.91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద (గురువారం రూ.81.47) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (గురువారం రూ.97.57), డీజిల్‌ రూ.88.60 (గురువారం రూ.88.60) గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గురువారంతో పోలిస్తే ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.79 (గురువారం రూ.94.79) ఉండగా, డీజిల్‌ ధర రూ.88.86 (గురువారం రూ.88.86)గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.94.88 (గురువారం రూ.94.67), డీజిల్‌ రూ.88.92 (గురువారం రూ.88.73)గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.39 (గురువారం రూ.97.28 ), డీజిల్‌ ధర రూ. 90.91(గురువారం రూ.90.79) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.38 (గురువారం రూ.96.13)గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ.89.92 (గురువారం రూ.89.96)గా వద్ద కొనసాగుతోంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.11 ఉండగా (గురువారం రూ.93.11 ), డీజిల్‌ ధర రూ.86.45 (గురువారం రూ.86.45) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 (గురువారం రూ.94.22 ), ఉండగా డీజిల్‌ ధర రూ. 86.37 (గురువారం రూ.86.37 ) గా ఉంది.

Also Read: Today Gold Price: భారీగా దిగి వస్తున్న బంగారం ధరల.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Gold Price: రూ.40వేల దిగువకు బంగారం..? పసిడి ధరలు ఎందుకు క్షీణిస్తున్నాయి.. ఏడు నెలల్లో రూ.12వేలకుపైగా తగ్గిన పుత్తడి ధర

Today Silver Price: భారీగా తగ్గుముఖం పట్టిన వెండి ధర.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు.. తాజాగా ఎంత తగ్గిందంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us